Thursday, June 17, 2010

maa vooru maaripoindi

నేను సౌత్ ఆఫ్రికా వచ్చే ముందు ఒకసారి మా వూరు (మాచర్ల )వెళ్లి వచ్చాను. మా వూరు చాలా మారి పోయింది. ఇదివరకు అందరు హాయిగా ఆరు బయట పడుకునే వాళ్ళం. లేదంటే మేడ మీద పడుకునే వాళ్ళం. చల్లటి గాలి వచ్చేది, హాయిగా నిద్ర పోయే వాళ్ళం.

మొన్న వెళ్ళినప్పుడు అసలు బయట పడుకునే వాడే లేదు. ఇంటి పైన పడుకునే వాళ్ళు కూడా లేరు. ఎంతప్పటికి ఏ సి లు వేసుకునే వాళ్ళు, కూలర్స్ వేసుకునే వాళ్ళే తప్ప  చల్లటి చెట్టు గాలి లో పడుకుందాం అనుకునే వాడే లేడు వూళ్ళో. ఎం చేస్తాం !! కాల మహిమ. !! నేను పడుకుంటా అన్నా మా అమ్మ నాన్న "ఏం వద్దులే, ఇంట్లో పడుకో అని గట్టిగా చెప్పారు. ఏం చేస్తా.. వినకపోతే  అదో గోల ఎందుకులే అని ఇంట్లోనే పడుకున్నా. 

నిద్ర గురించే కాదు. ఎండా కాలం అంటే తెలుసు కదా..వూరిలో సాయంత్రం 2 గంటలు కనీసం కరెంటు పోయేది.  చిన్నప్పుడు కరెంటు పోతే అందరు బయటికి వచ్చి సరదాగా కబుర్లు చెప్పేవాళ్ళు. పెద్దవాళ్ళు వుంటే మంచి మంచి నీతి కథలు చెప్పే వాళ్ళు, వాళ్ళ అనుభవాలు చెప్పేవాళ్ళు. గొప్ప నాయకుల గురించి చెప్పేవాళ్ళు, ఈ లోపు అమ్మ అన్నం కలుపుకుని వచెది అందరికి తల ఒక ముద్ద కలిపి తినిపించేది. సరదాగా ఆడుకునే వాళ్ళం, పాడుకునే వాళ్ళం. ఆ రోజులు ఇప్పుడు రమ్మన్నా రావు !!   

అయినా నా పిచ్చి గానీ,  Nintendos ,  Playstations రోజుల్లో పెద్ద వాళ్ళ కథలు అసలు ఎవరు చెప్తారు ఎవరు వింటారు ? ఇప్పుడు మనవాళ్ళకి చదువు పెరిగింది కానీ సంస్కారం తగ్గుతోంది. దీని గురించి తర్వాత చెప్తాను. 

మంచి నీళ్ళు కూడా కొనుక్కోవలసి వస్తోంది మా వూళ్ళో!! ఈ విషయం లో హైదరాబాద్ నయం,  ఇంకా స్వచ్చమయిన మంజీరా నీళ్ళు వస్తున్నాయి.

ఇప్పుడు కరెంటు పోగానే.. ఇన్వేర్టేర్స్ స్టార్ట్ అవుతాయి. అసలు బయటికి వెళ్ళాల్సిన అవసరమే రాదు. ఇప్పుకు మా సందు లో  ఒక చెట్టు లేదు, చల్లటి గాలి అంత కంటే  లేదు.  అంతా కాంక్రీంటు ప్రపంచం అయిపోయింది. ఎంతప్పటికి ఫ్యాన్ గాలి లేదంటే ఏ సి గాలి. అంతే..


నిజంగానే మా వూరు మారి పోయింది.

చిన్న ఊరిలోనే  ఇలా వుంటే హైదరాబాద్ లో ఎలా వుంటుందో ఊహించండి. !! మనం కూడా గ్లోబల్ వార్మింగ్ కి కారణమే.
అందరు మన రాజకీయ నాయకులు లాగా అమెరికా వాళ్ళే ఈ గ్లోబల్ వార్మింగ్ కి కారణం అనకుండా మనం అందరం కరెంటు, పెట్రోలు వాడకం వీలైనంత  తగ్గించాలి . వీలైతే కనీసం మనం అద్దెకు వుండే ఇంట్లో అయినా.. ఒక చిన్న చెట్టు నాటాలి.  ఈ విషయం లో నేను కొంచెం అదృష్ట వంతుడినే !! ఇక్కడ సౌత్ ఆఫ్రికా లో మా ఇంట్లో చిన్న తోట కూడా వుంది.. చిన్న చిన్న మొక్కలు పెంచుతున్నాను.   అంటే మనం చేసేది పెద్దగా ఏం లేదనుకోండి. 

1 comment:

  1. hi ra,
    i really wonder that you have same feeling which i felt..tes mana ooru maripoyindi..

    Chennakesava Reddy D

    ReplyDelete