ప్రస్తుతానికి నేను సౌత్ ఆఫ్రికా లో పని చేస్తున్నా.. మొత్తానికి ఇలా సరదాగా దేశాలు తిరగటం బానే వున్నా.. ప్రయాణాలు ఎక్కువై.. బోర్ కొట్టింది.. అందుకే ఒకేచోట పని చేద్దాం అని అనుకుని.. సౌత్ ఆఫ్రికా లో వచ్చిన అవకాశం వదులుకోలేదు.
ఇప్పుడు సౌత్ ఆఫ్రికా లో ఫిఫా ఫుట్ బాల్ వరల్డ్ కప్ జరుగుతోంది. చాల సరదాగా వుంది.. ఇక్కడ.. అందరూ చాలా సరదాగా.. ఈ గేమ్ ని ఫాలో అవుతున్నారు. ఎంతైనా.. సౌత్ ఆఫ్రికా లో ఆటలపై ధ్యాస చాలా ఎక్కువ.. మన IPL ని వీళ్ళు చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. ఐ పి ల్ ౩ ఇక్కడ జగనందుకు.. చాలా మంది ఫీల్ అయ్యారు.
అయినా మనకు మన తల్లి తండ్రులకు ఆటల కంటే IAS, IPS IIT డాక్టర్స్ అంటే నే గౌరవం ఎక్కువ. నిన్న పేపర్ లో చదివాను.. మెస్సి (అర్జంటినా) 200 కోట్లు జస్ట్ దానం చేసాడంట. మనం IIT చేసి ఎన్నాళ్ళు సంపాదించాలి.. 200 కోట్లు ??
ఇప్పటిదాకా లైఫ్ లో నేను నేర్చుకున్నది ఒక్కటే. లైఫ్ లో ఏదైనా సరే.. మనసు పెట్టి చేస్తే.. విజయం సాధించటం పెద్ద విషయం కాదు. ఆటలైనా చదువైనా !!
ఇంత సోది ఎందుకు అంటే.. మన టీం లేదు కదా FIFA లో !! అందుకు !!
కానీ.. ఒక విషయం లో మాత్రం నేను చాలా ఆనందం గా వున్నాను. ఇంత పెద్ద ఈవెంట్ కి టెక్నాలజీ పార్ట్నర్ సత్యం కంప్యూటర్స్. ఫుట్ బాల్స్ అన్ని ఇండియా లో నే తాయారు చేస్తారు.
keep blogging... :)
ReplyDelete